Site icon NTV Telugu

Bhatti Vikramarka: సీఎల్పీ నేత పాదయాత్రలో అకాల వర్షం.. పరుగులు తీసిన నేతలు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క పాద‌యాత్రలో నిన్నటి వ‌ర‌కూ భానుడు సెగ‌లు క‌క్కితే.. ఇప్పుడు వ‌రుణ‌దేవుడు కుంభ‌వృష్టి కురిపించాడు. పెద్దపల్లి జిల్లా మ‌డుప‌ల్లి శాంతిన‌గ‌ర్‌లో బ‌స చేస్తున్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్కను వ‌ర్షం త‌డిసి ముద్ద చేసింది. గాలి వాన‌కు వేసిన టెంట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. పాదయాత్రలోని నేతలందరూ చెట్ల కిందకు పరుగులు తీశారు. మొత్తం సామాగ్రి త‌డిపోయింది.

Read Also: Etela Rajendar: భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్ ప్రమాణం.. ఈటల రియాక్షన్ ఇదే..

సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క, ఆయ‌న అనుచ‌రుల కోసం వండిన వంట ప‌దార్థాల‌న్నీ నీటిపాల‌య్యాయి. భ‌ట్టి విక్రమార్క పాద‌యాత్రలోని స‌హ‌చ‌రుల‌కంద‌రికీ మ‌నో ధైర్యాన్ని ఇచ్చారు. దాదాపు గంట‌పాటు కురిసిన భారీ వ‌ర్షానికి పాద‌యాత్ర సామాగ్రి మొత్తం నీటిపాలైంది. అప్పట్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్రలోనూ ఇలాంటి వాన‌లు ప‌డ్డ విష‌యాన్ని రాజ‌కీయ పండితులు, విశ్లేష‌కులు గుర్తు చేసుకున్నారు.

Exit mobile version