Site icon NTV Telugu

Unstoppable 2 : థియేటర్లలో బాలయ్య – పవన్ కల్యాణ్ అన్‎స్టాపబుల్ ఎపిసోడ్.. ఫ్యాన్స్‎కు పూనకాలే

Pavan

Pavan

Unstoppable 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’..ద్వారా బాలయ్య బాబు మొదటిసారి వ్యాఖ్యాతగా వచ్చాడు. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ సూపర్ సక్సెస్ దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండియా లోనే నెంబర్ 1 టాక్ షో గా మారిపోయింది. ఇప్పటి వరకు ఎంతో మంది రాజకీయ, సినీప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కానీ ఈ సీజన్ లో మాత్రం యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఇటీవల హాజరయ్యారు..వారిలో ఒకరు ప్రభాస్ కాగా , మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్ ని ఆహా లో స్ట్రీమింగ్ చేశారు. రెస్పాన్స్ ఓ రేంజ్ లో అదిరిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాలయ్యతో కలిసి ఈ షోలో సందడి చేయనున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది.ఇప్పటివరకు ఒక లెక్కా..ఇక ఇప్పటినుంచి ఒక లెక్క అనేలా పవన్‌ కల్యాణ్‌ షోను ప్లాన్‌ చేస్తున్నారు.

Read Also: Jammu & Kashmir Snowfall : జమ్మూలో హిమపాతం.. మూసుకుపోయిన శ్రీనగర్‌-లేహ్‌ రోడ్డు

మూడు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ చేశారు..సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ ఎపిసోడ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో అందరికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో కలిసి డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని ప్రముఖ థియేటర్స్ లో ఈ ఎపిసోడ్ ని ప్రదర్శించడానికి చూస్తున్నారట. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ షో ని చూడడానికి థియేటర్స్ కి ప్రేక్షకులు ఎగబడుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద మరోసారి పండుగ వాతావరణం నెలకొంటుంది అనే చెప్పొచ్చు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version