Unstoppable 2 : థియేటర్లలో బాలయ్య – పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’..ద్వారా బాలయ్య బాబు మొదటిసారి వ్యాఖ్యాతగా వచ్చాడు. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ సూపర్ సక్సెస్ దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండియా లోనే నెంబర్ 1 టాక్ షో గా మారిపోయింది. ఇప్పటి వరకు ఎంతో మంది రాజకీయ, సినీప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కానీ ఈ సీజన్ లో మాత్రం యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఇటీవల హాజరయ్యారు..వారిలో ఒకరు ప్రభాస్ కాగా , మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్ ని ఆహా లో స్ట్రీమింగ్ చేశారు. రెస్పాన్స్ ఓ రేంజ్ లో అదిరిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాలయ్యతో కలిసి ఈ షోలో సందడి చేయనున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది.ఇప్పటివరకు ఒక లెక్కా..ఇక ఇప్పటినుంచి ఒక లెక్క అనేలా పవన్ కల్యాణ్ షోను ప్లాన్ చేస్తున్నారు.
Read Also: Jammu & Kashmir Snowfall : జమ్మూలో హిమపాతం.. మూసుకుపోయిన శ్రీనగర్-లేహ్ రోడ్డు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మూడు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ చేశారు..సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ ఎపిసోడ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో అందరికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో కలిసి డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని ప్రముఖ థియేటర్స్ లో ఈ ఎపిసోడ్ ని ప్రదర్శించడానికి చూస్తున్నారట. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ షో ని చూడడానికి థియేటర్స్ కి ప్రేక్షకులు ఎగబడుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద మరోసారి పండుగ వాతావరణం నెలకొంటుంది అనే చెప్పొచ్చు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!