Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak: ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గాలివానలు బీభత్సం సృష్టించాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట్లో 3.2 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా చేగుంటలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మార్కెట్ యార్డ్ల్లో ధాన్యం తడిసి ముద్దవగా, వర్షంలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామంలో ఈదురుగాలుల ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. వర్షం కారణంగా వరి ధాన్యం కూడా తడిసిపోయింది. అదేవిధంగా అల్లాదుర్గంలో భారీ వృక్షం రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోడౌన్ కప్పు ఎగిరిపోవడంతో ధాన్యం బస్తాలు తడిశాయి. ఇక సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో ఇండ్ల మధ్య భారీ వృక్షం కూలిపోగా, వట్పల్లిలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు చెట్ల కింద, పాత భవనాల వద్ద లేదా హోర్డింగ్ల కింద నిలబడవద్దని అధికారులు జనాలకు సూచించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని.. వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!