Site icon NTV Telugu

India vs Pakistan: పాకిస్థాన్ తో చర్చలపై భారత్ కీలక వ్యాఖ్యలు..

Jaishankar

Jaishankar

భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడవు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకోవడం లేదు అని ఆయన చెప్పారు. చర్చల కోసం భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్ చాలా కాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోందని ఆరోపించారు. అయితే, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య చర్చలు జరిగే ప్రసక్తి లేదన్నారు.

Read Also: Prabhas: మైటీ బాహుబలి 2ని బీట్ చేయబోతున్న ఖాన్సార్ కా సలార్…

అయితే, భారతదేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. మేము పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద విధానాన్ని రూపుమాపుతామన్నారు. గత సంవత్సరం, అప్పటి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తన కోరికను వ్యక్తం చేశారు. అదే సమయంలో కొద్ది రోజుల తర్వాత పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతదేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుందని ఎస్ జైశంకర్ అన్నారు. ఆ దేశంలో క్షీణిస్తున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, అధిక ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. ప్రస్తుతం దీని నుంచి బయటపడే మార్గాన్ని కనుగొనడం వారి పని.. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు.. వారికి భారతదేశం సహాయం చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు.

Exit mobile version