రెబల్ స్టార్ ప్రభాస్ తన మాస్ రేంజ్ ఏంటో చూపిస్తే బాక్సాఫీస్ పునాదులు కదలాల్సిందే, కొత్త రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే. సలార్ సినిమాతో ఇదే చేసి చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ క్యారెక్టర్ ని ప్రభాస్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ఇంపాక్ట్ అన్ని సెంటర్స్ లోని కలెక్షన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. తెలుగు రాష్ట్రాలు, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో ప్రభాస్ మేనియా కొనసాగుతుంది. ఓవర్సీస్ లో 8 మిలియన్ క్రాస్ చేసి రేర్ ఫీట్ సాధించిన ప్రభాస్, నార్త్ బెల్ట్ లో మరో వంద కోట్లు రాబట్టాడు. క్లాష్ తో కూడా వంద కోట్లు రాబట్టడం అంత ఈజీ విషయం కాదు. ప్రభాస్ రేంజ్ ని చూపిస్తుంది నార్త్ కలెక్షన్స్. న్యూ ఇయర్ కావడంతో సలార్ కలెక్షన్స్ లో హ్యూజ్ స్పైక్ కనిపించింది.
అన్ని సెంటర్స్ కన్నా యునానిమస్ గా టాప్ లో ఉన్నాయి సలార్ నైజాం కలెక్షన్స్. ఓపెనింగ్ డే నుంచి రచ్చ లేపుతున్న నైజాం కలెక్షన్స్ ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ వైపు వెళ్తున్నాయి. కేవలం నైజాం సెంటర్ లోనే ప్రభాస్ సలార్ సినిమాతో వంద కలెక్షన్స్ ని రాబట్టాడు. షేర్ పరంగా చూస్తే నైజాంలో 11 రోజుల్లోనే సలార్ సినిమా 70 కోట్ల వసూళ్లని రాబట్టింది. నైజాంలో సలార్ సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తుంది. బాహుబలి 2 ఈ సెంటర్ లో 73 కోట్ల షేర్ ని రాబట్టింది… ఈ వీకెండ్ లోపు సలార్ సినిమా 73 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి ప్రభాస్ కెరీర్ లో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతుంది. దీంతో ఓవరాల్ గా సినిమాల నైజాం కలెక్షన్స్ విషయంలో సలార్ సెకండ్ ప్లేస్ లో ఉండనుంది. ఫస్ట్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉంది.