Site icon NTV Telugu

Rammohan Naidu: భోగాపురం ఎయిర్‌పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తాం‌..

Rammohan Naidu

Rammohan Naidu

Rammohan Naidu: తనను గెలిపించిన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. అత్యంత చిన్నవయసులో కేంద్ర మంత్రి అయ్యానంటే ఆ ఘనత జిల్లా వాసులదేనన్నారు. ఎంపీ అయినా కేంద్ర మంత్రి అయినా తన స్వభావం మారదన్నారు. తన తండ్రి స్వర్గీయ ఎర్రన్నాయుడు ఆశీస్సులు తనపైన ఉంటాయన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభివృద్ది కోసం అంత:కరణ శుద్ధితో పనిచేస్తానని రామ్మోహన్‌ నాయుడు ప్రమాణం చేశారు.

Read Also: PM Kisan : కేంద్రం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం నిధులు విడుద‌ల..

ఒక్కశాఖకు నేను మంత్రినని, అన్ని శాఖల మంత్రులతో పరిచయం ఉందన్నారు. రాష్ర్ట అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటన్నింటిని పరిష్కరించుకోవాలన్నారు. చంద్రబాబుకి అవమానం జరిగిన చోటే, రికార్డ్ మెజారిటీ సాధించారన్నారు. జనసేన, బీజేపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తాం‌మన్నారు. రైల్వే సమస్యలు పరిష్కరిస్తామని, సాగునీటి ప్రాజెక్ట్‌ల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాజకీయ బాహుబలి అచ్చెన్నాయుడని ప్రశంసించారు. 175కి 160 స్థానాలకు పైగా వస్తాయని చెప్పింది అచ్చెన్నాయుడేనని వెల్లడించారు. మాకు అభివృద్ధి కావాలని, కక్షరాజకీయాలు వద్దన్నారు.

Exit mobile version