NTV Telugu Site icon

Rammohan Naidu: కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్టానికి ఏమి చేస్తాడు.. జగన్ పై ఫైర్

Rammohan Naidu

Rammohan Naidu

తిరుపతిలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విమానాల్లో బాంబు బెదిరింపులపై మంత్రి స్పందించారు. గత 9 రోజులుగా చాలా బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.. వాటిని చాలా సీరియస్‌గా తీసుకున్నాం‌మని తెలిపారు. బెదిరింపులు ఎక్స్ వేదికగా వస్తున్నాయి.. కానీ అవన్నీ ఫేక్ అని తెలుతున్నాయని అన్నారు. ఏవియేషన్, హోంశాఖ కలసికట్టుగా పనిచేస్తున్నాయని.. త్వరలోనే ఇలాంటి వాటికి అంతం పలుకుతామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. బెదిరింపు కాల్స్ చేసే వారికి, బెదిరిస్తూ సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జైలు శిక్ష విధించేలా చట్టపరమైన మార్పులు తీసుకువస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అలాంటి వారికి మళ్ళీ విమానంలో తిరిగే అవకాశం లేకుండా చేయాలని చట్టం తెస్తున్నాం‌మని చెప్పారు.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్‌కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు

ఓ ఫేక్ కాల్‌లో ముంబై పోలీసులు ఓ మైనర్‌ బాలుడ్ని పట్టుకున్నారు.. అతని స్నేహితుడుపై కోపం అతను అలా చేశాడని విచారణలో తెలిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. చాలా మంది ఫ్రాంక్ కిందా చేస్తున్నారా లేక కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ తరువాత బయటికి వస్తుందని చెప్పారు. మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని దుయ్యబట్టారు. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి జగన్.. ఇక రాష్టానికి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. కుటుంబానికి ఏం న్యాయం చేశాడో జగన్ మొదటిగా చెప్పాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Read Also: IND vs NZ 2nd Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్