Site icon NTV Telugu

Ram Mohan Naidu: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Rammohan Naidu

Rammohan Naidu

Ram Mohan Naidu: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ జరగనుందని తెలిపారు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలకు సాకారం లభించిందన్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్ళను నడిపి ప్రపంచానికి మేకిన్ ఇండియా కెపాసిటీ చూపిస్తామన్నారు. ప్రస్తుతం రైల్వేలు, పౌర విమానయాన సంస్థలు పోటీపడి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే జోన్ హెడ్ క్వార్టర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ముడసర్లోవ దగ్గర 52 ఎకరాలను రైల్వేశాఖ కు జిల్లా యంత్రాగం అప్పగించింది. రాష్ట్ర విభజన సమయంలో జోన్ అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 27న భారత ప్రభుత్వం ఈ జోన్‌ ఏర్పాటును ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు ఇందులో భాగంగా ఉంటాయి. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Also: Jani Master: జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన

విశాఖ-దుర్గ్‌ వందే భారత్ రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విశాఖ జంక్షన్‌లో ఉత్తరాది రాష్టాలకు తొలి సెమీ హైస్పీడ్ రైలుగా ఈ వందేభారత్‌ రైలు నిలిచింది. ఏపీ,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ రైలు ప్రయాణించనుంది. దీంతో విశాఖ నుంచి వందే భారత్ నెట్‌వర్క్ నాలుగుకు పెరిగింది. ప్రస్తుతంవిశాఖ-,సికింద్రాబాద్ మధ్య 2, విశాఖ-భువనేశ్వర్ మధ్య ఒక వందేభారత్‌ రైళ్ల రాకపోకలు నడుస్తున్నాయి. రాయ్‌పూర్‌-విజయనగరం మార్గంలో ఇది మొదటిది కావడం గమనార్హం. అనంతరం వందే భారత్ రైలులో కేంద్ర మంత్రి ప్రయాణించతారు. కొత్త సర్వీసు వల్ల రాయ్‌పూర్ – విశాఖల మధ్య కనెక్టివిటీ పెరగనుంది. విద్యా, వైద్య , వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించే వారికి మరింత అనుకూలంగా రైలు ప్రయాణం మారనుంది. 7గంటల వ్యవధిలోనే వందే భారత్ దుర్గ్ చేరనుంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం మీదుగా వందే భారత్ రాకపోకలు సాగించనుంది.

 

Exit mobile version