NTV Telugu Site icon

Rajnath Singh: దేశం దీర్ఘకాలిక ప్రయోజనాలు మా లక్ష్యం.. బీజేపీ.. నాన్‌ బీజేపీ ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూడండి..!

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: దేశం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కట్టుబడి ప్రణాళికలు రూపొందించడం మా ప్రభుత్వం లక్ష్యం.. దేశ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం.. బీజేపీ.. నాన్‌ బీజేపీ ప్రభుత్వాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి అని సూచించారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. విశాఖలో క్లస్టర్ ప్రవాస్ యోజనలో భాగంగా జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ద్రవ్య లోటుతో ప్రపంచంలో అనేక దేశాలు అతలాకుతలం అవుతుంటే కరెంట్ డెఫ్ షీట్ లేని దేశంగా భారత్ అవిర్భవించింది.. ఖతార్ లో గూఢ చర్యం కేసులో చిక్కుకుని శిక్ష అనుభవిస్తున్న భారత మాజీ నేవీ అధికారులను సురక్షితంగా స్వదేశానికి రప్పించిన దౌత్య నీతి.. ప్రధాని కారణంగా సాధ్యం అయ్యిందన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న వేలాది మంది విద్యార్థులను స్వదేశానికి తెచ్చిన ఘనత బీజీపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.

Read Also: boAt smartwatch: అమోలెడ్‌ డిస్‌ప్లేతో ‘బోట్‌’ స్మార్ట్‌వాచ్‌.. బ్యాటరీ లైఫ్‌ 7 డేస్!

కేవలం రాజకీయాల కోసమే భారతీయ జనతాపార్టీ లేదు, దేశాన్ని ప్రపంచ అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు రాజ్‌నాథ్‌.. ట్రిపుల్ తలాక్, సివిల్ కామన్ కోడ్, అయోధ్య రామాలయం, ఆర్టికల్ 377 ద్వారా కాశ్మీర్ లో స్వేచ్ఛా వాయువులు లాంటి సాహసోపేత నిర్ణయాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇక, 2027 నాటికి ప్రపంచంలోనే భారత్ మూడో ఆర్ధిక శక్తిగా నిలబడడంలో ఎలాంటి సందేహం లేదన్న ఆయన.. 2047 నాటికి ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం అన్నారు. UPI లావాదేవీల్లో భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది.. ఎన్నికలు, ప్రభుత్వం ఏర్పాటు కోసం పని చేస్తున్న ప్రభుత్వం బీజేపేది.. రాబోయే ఐదు – ఏడేళ్ల కాలంలో ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు కాబోతున్నాయన్నారు.

Read Also: Gollapalli Surya Rao: టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మాజీ మంత్రి..!

భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ కాదు.. నికార్సైన సెక్యులర్ పార్టీగా ప్రపంచం గుర్తించిందన్నారు రాజ్‌నాథ్.. సౌత్, నార్త్ ఇండియా పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.. భాష, ప్రాంతీయ వాదం పేరుతో సమగ్రతకు నష్టం కలిగించే చర్యలు అడ్డుకోవాలని సూచించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో BJP ఓట్ బ్యాంక్ పెరిగింది.. బీజేపీ ఒకరోజు అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ గనుక దక్షిణాదిలో పనేంటాని అడుగు తున్నారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలలోనూ మేం అధికారంలో ఉన్నామని తెలిపారు. అనేక రాష్ట్రాలలో సెకండ్ ప్లేస్ బీజేపీదే.. కుటుంబ పాలన, అవినీతికి కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిదని ఫైర్‌ అయ్యారు. రఫెల్ విమానాలను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే.. దేశీయ నైపుణ్యంతో అద్భుతమైన ఉత్పత్తిని సాధిస్తున్నాం అన్ని వెల్లడించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.