డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. దాదాపు అందరు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ప్రతి రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ఉపయోగించే దేశాల జాబితాలో ఖతార్ చేరింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజధాని దోహాలోని లులు మాల్‌లో UPI వ్యవస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో, UPI అనేది డిజిటల్ చెల్లింపు పద్ధతి మాత్రమే కాదు, భారతీయ ఆవిష్కరణ, సాంకేతికత శక్తికి చిహ్నం అని పియూష్ గోయల్ తెలిపారు.
Also Read:Rohit Sharma: కెప్టెన్సీ లేని అతడు మరింత ప్రమాదకరం.. మళ్లీ పాత రోహిత్ను గుర్తు చేస్తాడా..?
రెండు రోజుల ఖతార్ పర్యటన సందర్భంగా, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ యుపిఐ వ్యవస్థను ప్రారంభించారు. ఇది భారతదేశం-ఖతార్ భాగస్వామ్యాన్ని పెంచుతోందన్నారు. భారతదేశంలో 85% డిజిటల్ చెల్లింపులు ఈ వ్యవస్థ ద్వారా జరుగుతుండగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50% డిజిటల్ చెల్లింపులు యుపిఐ ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. ఖతార్ నేషనల్ బ్యాంక్ (QNB), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో కలిసి, తన వ్యాపారి క్లయింట్ల కోసం పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్‌లో QR కోడ్ ఆధారిత UPI చెల్లింపులను ప్రారంభించింది.
ఖతార్‌లోని లులు అవుట్‌లెట్‌లు ఇప్పుడు భారతీయ చెల్లింపు వ్యవస్థ ద్వారా లావాదేవీలను అంగీకరిస్తుండటంతో, భారతదేశం నుండి వచ్చే పర్యాటకులు ఖతార్‌లో సులభమైన, సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపులను చేయొచ్చు. ఈ సేవలతో నగదు తీసుకెళ్లడం లేదా కరెన్సీ మార్పిడి అవసరం తగ్గుతుంది. దోహాలో UPIని ప్రారంభించడంతో పాటు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్.. ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి హిజ్ హైనెస్ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థానితో కూడా సమావేశం అయ్యారు. ఆర్థిక, వాణిజ్య సహకారంపై చర్చించినట్లు తెలిపారు.
