NTV Telugu Site icon

Union Minister Pemmasani Chandrasekhar: రాజకీయ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి.. త్వరలోనే అభివృద్ధి పనులు పట్టాలెక్కిస్తా..

Pemmasani

Pemmasani

Union Minister Pemmasani Chandrasekhar: కొన్ని అభివృద్ధి పనులకు రాజకీయ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే అన్ని అభివృద్ధి పనులు పట్టాలెక్కుతాయన్నారు.. రాష్ట్రంలో పారదర్శకత, భాధ్యతతో కూడిన పాలన సాగించాలన్న ఆలోచనతో ఉన్నాం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన బ్రిడ్జిలు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కొంత సమయం పడుతుందన్నారు.. రెండు మూడు నెలల్లో అన్నీ పనులు అయిపోవాలంటే, జరిగే పని కాదన్న ఆయన.. కొన్ని అభివృద్ధి పనులకు రాజకీయ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.

Read Also: Committee Kurrollu: ఆగష్టు 9న థియేటర్లలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్లు..

గతంలో ప్రభుత్వ హాస్పిటల్ తో పాటు, గుంటూరులో నిర్మించాల్సిన రైల్వే బ్రిడ్జిలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు పెమ్మసాని.. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో గడిచిన సమీక్షలో మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించామన్న ఆయన.. ప్రస్తుత వర్షాకాల పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. గుంటూరులో నిర్మించాల్సి ఉన్న పలు రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై కూడా సమీక్ష సాగింది త్వరలోనే అన్ని అభివృద్ధి పనులు పట్టాలెక్కుతాయన్నారు పెమ్మసాని చంద్రశేఖర్‌.

Read Also: G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..

ఇక, జగన్ రోడ్డు మీదకు వస్తే ఏపీ అభివృద్ధి నిలిచిపోతుందని సూచించారు పెమ్మసాని.. వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన హత్య.. అది రాజకీయ హత్య కాదన్నారు. మాచర్లలో తోట చంద్రయ్య హత్య, రాజకీయ హత్య… ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? అని ప్రశ్నించారు. మాచర్ల ప్రాంతంలో ఒక మనిషి ప్రాణాలు తీసేస్తే పరామర్శించాలి కదా..? అని నిలదీశారు. జగన్ వల్ల ఢిల్లీలో తెలుగు వాళ్ల పరువు పోతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా జగన్ పై సరైన అభిప్రాయం లేదన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌.