Site icon NTV Telugu

Andhra Pradesh Debts: ఏపీ అప్పులపై మరోసారి కేంద్రం క్లారిటీ.. అసలు అప్పు ఎంతంటే..?

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Andhra Pradesh Debts: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముగిసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పు.. 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులతో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య రూ.4,42,442 కోట్లకు చేరుకున్నట్లు నిర్మల వెల్లడించారు. అంటే వైసీపీ సర్కార్ ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు రూ.1,77,991 కోట్లుగా నిర్మల పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టం చేశారు. కాగా, ఏపీ ప్రభుత్వం అప్పులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.. టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు.. ఇలా విపక్షాలు మొత్తం వైసీపీ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నాయి. అయితే, గతంలో టీడీపీ హయాంలో కంటే తక్కువ అప్పులు చేశామని వైసీపీ చెప్పుకొస్తున్నా.. విమర్శలు మాత్రం తగ్గడం లేదు..

Read Also: Students Fighting: రోడ్డెక్కిన విద్యార్థుల గొడవ.. రెండు వర్గాలుగా చీలి పరస్పరం దాడులు

అయితే, ఏపీ అప్పులపై ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి క్లారిటీ ఇచ్చారు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పార్లమెంట్‌లో ప్రస్తావించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని, ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటి మరీ అప్పులు చేస్తోందని ఆరోపించారు. అప్పులకు సంబంధించి అసెంబ్లీకి కూడా వివరాలు ఇవ్వడం లేదని లోక్‌సభలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులకు సమాధానం చెప్పాలని కోరారు… అయితే, ఏపీ అప్పులపై ఇప్పటికే ఓ సారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.. ఇప్పుడు మరోసారి క్లారిటీగా పార్లమెంట్‌లో వివరించారు.

Exit mobile version