NTV Telugu Site icon

Kishan Reddy Riyadh Tour: రియాద్ పర్యటనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కారణం ఇదే..

Kishanreddy

Kishanreddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు రియాద్ పర్యటనకు బయలు దేరారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న ‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’లో పాల్గొననున్నారు. ‘టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్’ థీమ్‌తో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతుంది.

READ MORE: Nitish Kumar Reddy: మోకాళ్లపై తిరుమల కొండకు నితీశ్‌కుమార్ రెడ్డి..

అనంతరం వివిధ దేశాల గనుల శాఖ మంత్రులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రులు, కంపెనీల సీఈవోలు ఈ కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్నారు. ఖనిజ సంపదపై ఫలప్రదమైన చర్చ జరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖనిజ సంపద సద్వినియోగం అవ్వాలన్న లక్ష్యంతో సౌదీ అరేబియా ప్రభుత్వం రియాద్ వేదికగా మూడేళ్లుగా ఈ సదస్సును నిర్వహిస్తోంది.

READ MORE: Padi Kaushik Reddy : పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన హరీష్‌ రావు, కేటీఆర్‌

Show comments