Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Kishan Reddy Inspected The Development Works Of Begumpet Railway Station

Kishan Reddy: బేగంపేట్ రైల్వేస్టేషన్ మహిళలతో నడుపుతాం.. మహిళా లోకానికి ఈ రైల్వే స్టేషన్ అంకితం

Published Date :March 15, 2025 , 1:01 pm
By Rajesh Veeramalla
  • బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి
  • రైల్వేలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి- కిషన్ రెడ్డి
  • రీసెంట్‌గా చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించుకున్నం- కిషన్ రెడ్డి
  • త్వరలో బేగంపేట్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభోత్సవం చేసుకుందాం- కిషన్ రెడ్డి.
Kishan Reddy: బేగంపేట్ రైల్వేస్టేషన్ మహిళలతో నడుపుతాం.. మహిళా లోకానికి ఈ రైల్వే స్టేషన్ అంకితం
  • Follow Us :
  • google news
  • dailyhunt

బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం రీ డెవలప్మెంట్ చేస్తుంది. ఈ క్రమంలో.. రూ.27 కోట్లతో బేగంపేట్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు. బేగంపేట్ రైల్వే స్టేషన్‌ను కిషన్ రెడ్డి పరిశీలించి.. అనంతరం మాట్లాడారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి.. రీసెంట్‌గా చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించుకున్నాం.. త్వరలో బేగంపేట్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభోత్సవం చేసుకుందామని తెలిపారు.

Read Also: CM Revanth Reddy: బీఆర్ఎస్ వాళ్లకు గవర్నర్, మహిళల పట్ల గౌరవం లేదు..

కేవలం 5-10 శాతం పనులు మిగిలి ఉన్నాయి.. రూ.26 కోట్లతో మొదటి దఫా పనులు సాగుతున్నాయి.. రెండో దశలో రూ.12 కోట్లతో పనులు జరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా వచ్చింది.. ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే ముక్కులు మూసుకుని రావాల్సి వచ్చేదని చెప్పారు. ఎక్కడ చూసినా కంపుతో నిండిపోయేది.. బాటిల్స్, చెత్త చెదారం ఉండేది.. వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మార్పులు చేస్తుందని పేర్కొన్నారు. కాగా.. బేగంపేట్‌లో ఉచిత వైఫై సౌకర్యం ఇవ్వబోతున్నాం.. పూర్తిగా మహిళలతో ఈ రైల్వే స్టేషన్ నడుపుతామని కిషన్ రెడ్డి చెప్పారు. మహిళా లోకానికి ఈ రైల్వే స్టేషన్‌ను అంకితం చేస్తామన్నారు. ఇక్కడ నుంచి ప్రతిరోజు 15 వేలమంది ప్రయాణం చేస్తున్నారు.. ఫస్ట్, సెకండ్ ఫేస్‌లు కలిపితే రూ.39 కోట్లతో బేగంపేట్ రైల్వే స్టేషన్ నీ తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

Read Also: CM Chandrababu: ఏ ఊరికి వస్తానో చెప్పను.. క్లీన్‌గా లేకపోతే అంతే..! సీఎం స్వీట్‌ వార్నింగ్‌..

అలాగే.. కవచ్ టెక్నాలజీని ప్రయోగిస్తున్నాం.. కవచ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సికింద్రాబాద్‌లో రాబోతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రమాదాలను అరికట్టేందుకు కవచ్‌ను ప్రారంభించబోతున్నామన్నారు. అంతేకాకుండా.. న్యూ ట్రాక్స్ నిర్మాణం కోసం రూ.39,300 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.. 1,096 కిలోమీటర్లు ఎలక్ట్రిఫై చేశామని చెప్పారు. తెలంగాణలో 100 శాతం ఎలెక్ట్రిఫై చేశామని కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే ట్రాక్స్ దగ్గర ప్రమాదాలు జరగకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మరోవైపు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం వేగవంతంగా సాగుతోంది.. వచ్చే ఏడాది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఎయిర్ పోర్ట్‌ను తలపించే విధంగా నిర్మాణం జరుగుతుందని అన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు మారబోతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి అప్రోచ్ రోడ్డుకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి.. ముఖ్యమంత్రితో మాట్లాడాను.. ఇంకా కొలిక్కి రావాల్సి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Begumpet railway station
  • Begumpet Station
  • Development Works
  • Indian Railways
  • Kishan Reddy

తాజావార్తలు

  • Corporate Jihad: నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’.. హిందూ ఉద్యోగులే టార్గెట్.. నమాజ్ చేస్తేనే సాలరీ హైక్..

  • KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు

  • Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!

  • Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

ట్రెండింగ్‌

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions