ఢిల్లీ నేషనల్ ఆర్ట్ గ్యాలరీని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ శాసన సభ్యుల కొనుగోలు ఆరోపణల విషయంలో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ లో ఎటువంటి ఆధారాలు చూపలేదన్నారు. శాసన సభ్యుల కొనుగోలు విషయంలో బీజేపీపై పసలేని ఆరోపణలు చేసారని, కింది స్థాయి నేతల నుంచి శాసన సభ్యులక వరకు వేరే పార్టీల వాళ్ళను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారన్నారు. రాజీనామాలు చేయించకుండా నేరుగా టీఆర్ఎస్ లో చేర్చుకుని పదవులు ఇచ్చారని, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ మాత్రమే అనిఆయన మండిపడ్డారు. బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి వివిధ పార్టీలకు రాష్ట్రంలో, శాసన సభలో ప్రాతినిధ్యం లేకుండా చేసారని, బీజేపీలో చేరడాన్ని క్షమించరాని నేరమని, పెద్దతప్పు అన్నట్లు చిత్రీకరణ చేస్తున్నారన్నారు. ఈటల నేతృత్వంలో చేరికల కమిటీ వేసామని, ఇతర పార్టీల నుండి వచ్చే వారు తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీ చేరాలని నిబంధన పెట్టామన్నారు. వేరే పార్టీల నేతలను చేర్చుకునే విషయంలో మేము నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాము. ఫిరాయింపులకు దేశంలో ఆద్యుడు, బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్. తెలంగాణలో త్వరలో కూలిపోయే ప్రభుత్వాన్ని మేము కూల్చే అవకాశం లేదు.
Also Read : Tamannah : రెడ్ డ్రెస్‌లో.. రెడ్ రోజ్‌లా తమన్నా పరువాలు
కేసీఆర్ లాగా మా దగ్గర కమీషన్ల డబ్బు మా దగ్గర లేదు. పార్టీలను సమూలంగా గొంతు నొక్కే వారు కేసీఆర్. వంద కోట్ల విలువ చేయనివారిని మేము కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఢిల్లీలో కాకపోతే లండన్ లోనో పాకిస్థాన్ లోనో, లేక విదేశాల్లో. మీడియా సమావేశం పెట్టుకోమని చెప్పండి. మీ పార్టీలో ఇతరులను చేర్చుకునే సమయంలో, పార్టీలను సమూలంగా రాష్ట్రంలో లేకుండా చేసిన కేసీఆర్ కు ఈ విషయం గుర్తుకు రాలేదా! మునుగోడులో గెలవడానికి కేసీఆర్ చేసే డ్రామాలు . ఓడిపోతున్నామని తెలిసి కేసీఆర్ ఈ డ్రామాలకు పాల్పడుతున్నారు. మీ విఠలాచార్య సినిమా స్క్రిప్టు లకు బీజేపీ భయపడదు. ఈ వ్యవహారంలో మా పార్టీ ప్రమేయం లేదు.
Also Read: Arvind Kejriwal: దేవుడి ఆశీర్వాదం అవసరం.. ‘గాడ్స్ ఆన్ కరెన్సీ’ డిమాండ్‌పై ప్రధానికి కేజ్రీవాల్ లేఖ
ఎటువంటి విచారణకు అయినా మేము సిద్ధమే! మా పార్టీ నేతలు, కార్యకర్తలను కేసీఆర్, కేటీఆర్ స్వయంగా ఫోన్ లు చేసి ప్రలోభ పెడుతున్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడతాము. తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉంది, కాని ప్రభుత్వంపై నమ్మకం లేదు. పోలీసులు కేసీఆర్ కనుసన్నలలో పనిచేస్తున్నారు. దేశంలో ఫిరాయింపులు, ప్రలోభాలకు గురిచేసే చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది. నందకుమార్ నాతోపాటు చాలా రాజకీయ పార్టీలకు తెలుసు, కేసీఆర్ కుటుంబానికి కూడా తెలుసు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
