NTV Telugu Site icon

Kishan Reddy: ఏపీలో 7 ఎయిర్ పోర్టులు.. తెలంగాణాలో మాముగనూరు రెండోది..

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని… మాముగనూర రెండోవది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కవాడిగూడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం వరంగల్.. చరిత్రాత్మక నగరం ఓరుగల్లులో విమానాశ్రయం కావాలనే డిమాండ్ ఉంది.. అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా గత కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా వచ్చి చర్చించారు.. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం మమునూరు ఎయిర్ పోర్ట్.. స్వాతంత్రం రాకముందు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడింది.. కాకతీయుల చరిత్ర కలిగిన వరంగల్ లో నిర్మించడం హర్షణీయం..” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: Rammohan Naidu: స్వాతంత్ర్యానికి ముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునురు..

ఏపీలో 7 ఎయిర్ పోర్టులు ఉన్నాయని.. తెలంగాణలో మామునూరు రెండో ఎయిర్ పోర్ట్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. “ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కట్టడాలు ఉన్నా రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది.. అయితే ఎయిర్ పోర్ట్ లేక ఆలస్యమైంది.. ఈ కాంపిటీషన్ లో ఎయిర్ పోర్ట్ లేనప్పుడు గుర్తింపు ఎందుకని ప్రశ్నించారు.. ప్రధాని మోడీ కలగజేసుకుని ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని హామీ ఇచ్చి యునెస్కో గుర్తింపు తెచ్చారు.. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ కూడా వచ్చింది..” అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

READ MORE: V. Hanumantha Rao: వీహెచ్‌ తీరుపై ఏఐసీసీ ఆగ్రహం.. స్పందించిన హనుమంతరావు..