Site icon NTV Telugu

Giri Raja Singh: మణి శంకర్ వ్యాఖ్యల పై కేంద్ర మంత్రి గిరిరాజ్ ఫైర్..

Giri Raja Singh 10

Giri Raja Singh 10

కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. పొరుగుదేశం పాకిస్థాన్ తో అణుబాంబులు ఉన్నందున భారత్‌ ఆ దేశాన్ని గౌరవించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మనం వారిని గౌరవించకపోతే భారత్‌పై అణుదాడి గురించి ఆలోచించవచ్చని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు సంబంధించి అయ్యర్ చేసిన ప్రకటనపై వివాదం నెలకొంది. దానికి స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ మ్యాప్ లో కూడా సరిగ్గా కనిపించదు.’ అని వ్యాఖ్యానించారు. మణిశంకర్ అయ్యర్ చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని గిరిరాజ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు టెర్రరిస్టుల భాష మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

READ MORE:Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ఇంటర్వ్యూ కి వచ్చిన యువతిపై..

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అయ్యర్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్‌కు భయం ఎక్కువన్నారు. కాంగ్రెస్ నాయకులు భారతదేశంలో నివసిస్తున్నా.. వారి హృదయాలు పాకిస్థాన్‌లో ఉన్నాయని విమర్శించారు. పాకిస్థాన్‌ను ఎలా సమాధానం చెప్పాలో భారత్ కు తెలుసని చెప్పారు. అదే సమయంలో మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై మరో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సిద్ధాంతం ఈ ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ పాకిస్థాన్‌, ఉగ్రవాదానికి మద్దతిస్తుందని దుయ్యబట్టారు.

బీజేపీ నేత మంజీందర్‌ సింగ్‌ సిర్సా మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ గౌరవం గురించి మాట్లాడుతున్న మణిశంకర్‌.. పాకిస్థాన్‌లో అణుబాంబులు ఉన్నాయని చెబుతున్నారన్నారు. భారతదేశం భయపడాలా అని ప్రశ్నించారు. ప్రకటనను నేను తీవ్రంగా ఖండించారు. ఒక నిర్దిష్ట తరగతి ఓట్ల కోసం ఇది జరుగుతోందని తెలిపారు. బీజేపీ ఎంపీ రవికిషన్ కూడా స్పందించారు. “అయ్యర్ స్వయంగా చికిత్స చేయించుకోవాలి. ఇది మోడీ భారతదేశం. ఇది కాంగ్రెస్ కాలం నాటి భారతదేశం కాదు. మోడీ ఫోటో చూసిన వెంటనే పాకిస్థాన్ ప్రజలకు మూర్ఛ వస్తుంది.” అదే సమయంలో.. మణిశంకర్ ప్రకటన వ్యక్తిగతమని ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ అన్నారు.

Exit mobile version