NTV Telugu Site icon

World Skydiving Day: 12 వేల మీటర్ల ఎత్తు నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ స్కైడైవింగ్..

Gajendra Singh Shekhawat

Gajendra Singh Shekhawat

భారతదేశంలో ప్రైవేట్ స్కైడైవింగ్ సౌకర్యాన్ని ప్రారంభించడం చాలా సంతోషదాయకమని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా శనివారం ప్రపంచ స్కైడైవింగ్ దినోత్సవాన్ని జరుపుకుంటుండగా.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ 12 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి స్కై డైవింగ్ చేశారు. ప్రపంచ స్కైడైవింగ్ దినోత్సవం సందర్భంగా హర్యానా రాష్ట్రం మహేంద్రగఢ్ జిల్లాలోని బచోడ్ గ్రామంలో ఎయిర్‌స్ట్రిప్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. “ప్రపంచ స్కై డైవింగ్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని నార్నాల్‌లో స్కై డైవింగ్ సదుపాయం ప్రారంభమైంది. నేను ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు స్కై డైవింగ్ చేయడం ఉత్సాహాన్ని ఇచ్చింది. భారత పర్యాటక శాఖ మంత్రిగా, ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడడం నా బాధ్యత. భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ స్కై డైవింగ్ ని ఆస్వాధిస్తారు. ” అని వ్యాఖ్యానించారు. అకాడమీని అభినందించారు.

READ MORE: Job Fraud Case: గిగ్లైజ్‌ కంపెనీ సీఈవోను కిడ్నాప్ చేయలేదు- జాగృతి కన్సల్టెన్సీ బాధితులు..

అనంతరం స్కై హై కంపెనీ వ్యవస్థాపకుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. “ఈ ఎయిర్‌స్ట్రిప్‌లో యువతకు స్కైడైవింగ్ నేర్పి్స్తున్నాం. భారతదేశంలో స్కైడైవింగ్ నేర్పించే ఏకైక ఎయిర్‌స్ట్రిప్ ఇదే. పూర్వం భారతదేశంలోని ప్రజలు స్కైడైవింగ్ నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్లేవారు. భారతదేశ సైన్యంలో స్కైడైవింగ్ పర్వతాల నుంచి మాత్రమే నేర్పిస్తారు. అయితే ఇప్పుడు.. విమానం పై నుంచి స్కైడైవింగ్ నేర్పిస్తున్నాం. ఈ ఎయిర్‌స్ట్రిప్‌లో ఇప్పటివరకు 7500 సురక్షితమైన స్కైడైవ్‌లు జరిగాయి. ఈ సంస్థ నాలుగు రోజుల ఏడు రోజుల రెండు కోర్సులను నిర్వహిస్తుంది. ఒక్క జంప్‌నకు ముప్పై వేల రూపాయలు వసూలు చేస్తున్నాం.” అని తెలిపారు.