Site icon NTV Telugu

Bandi Sanjay-TTD: టీటీడీ ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ

Sanjay

Sanjay

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ లేఖ రాశారు. ధూప-దీప-నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. కరీంనగర్‌లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 2023లో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది మే 31న కరీంనగర్‌లోని 10 ఎకరాల భూమిలో భూమి పూజ కూడా జరిగిందని గుర్తు చేశారు. అయితే ఆ రోజు నుంచి నేటివరకు నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఆలయ నిర్మాణాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరీంనగర్ సహా పొరుగు జిల్లాల హిందూ భక్తుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, ఆలయ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.

READ MORE: Hyderabad: పుట్టింది భారత్‌.. పెరిగింది అమెరికా.. హైదరాబాద్‌లో జోరుగా డ్రగ్స్ వ్యాపారం..

Exit mobile version