Site icon NTV Telugu

Sanchar Saathi portal: ‘సంచార్ సాథీ పోర్టల్’ ప్రారంభం.. ఇన్ని ప్రయోజనాలున్నాయా..?

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

Sanchar Saathi portal: కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. సంచార్ సాథీ పోర్టల్‌ను ప్రారంభించారు.. వర్చువల్ పద్ధతిలో విజయవాడ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కార్యాలయం నుంచీ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అధికారులు.. అయితే, ఈ పోర్టల్‌ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఒకొక్కరి పేరు మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.. మొబైల్ ఫోన్ ల ద్వారా చేసే నేరాలను అరికట్టడానికి సంచార్ సాథీ పోర్టల్ వినియోగించనున్నారు.. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ.. సీఈఐఆర్ అనేది సంచార్ సాథీ పోర్టల్‌కు మొదటి అంశంగా పేర్కొన్నారు. ఫోన్ పోయినప్పుడు ఫోన్ బ్లాక్ చేయడానికి సంచార్ సాథీ పోర్టల్ వినియోగించవచ్చు అన్నారు. డిజిటల్ ఐడెంటిటీ కోల్పోకుండా చూడటం కూడా ఒక అంశంగా పేర్కొన్న ఆయన.. Know Your Mobile రెండవ ఫీచర్‌గా ఇచ్చామన్నారు.

Read Also: DK Shivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

మీ పేరుతో ఎన్ని ఫోన్ నంబర్లు.. ఎక్కడెక్కడ దేశంలో తీసుకున్నారో కూడా తెలుసుకోవచ్చని తెలిపారు అశ్వనీ వైష్ణవ్‌.. వినయోగదారుడికి తెలీకుండా వేరెవరైనా ఫోన్ నంబరు తీసుకుంటే వెంటనే దానిని తీసివేసే అవకాశం కూడా ఉంటుందన్నారు.. నేరం చేయడానికి తీసుకునే ఫోన్ నంబర్లు తీసుకున్నా, ఫోటో మార్చి నంబర్‌ తీసుకున్న తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.. 87 కోట్ల మొబైల్ ఫోన్లపై కనెక్షన్లను పరిశీలిస్తే.. 42 లక్షల మోసపూరిత కనెక్షన్లు కనుగొని, 36 లక్షల కనెక్షన్లు రద్దు చేశామని వెల్లడించారు. మూడు విధాలైన సంస్కరణలతో సంచార్ సాథీ పోర్టల్ తీసుకొచ్చామని.. లొకేషన్ కనుక్కోవడం మాత్రమే కాకుండా లీగల్ విధానంలో ఒక ఫోన్ ను పనిచేయకుండా చేయచ్చు.. IMEI నంబరు సరైనదేనా అని కూడా ఇందులో కనుక్కోవచ్చు.. భారత టెలికాం సెక్టార్‌ను గ్లోబల్ లీడర్ గా చేయడయమే మా లక్ష్యంగా తెలిపారు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్.

Read Also: The Kerala Story: 150 నాటవుట్… 200 గ్యారెంటీ

అంటే.. ఇకపై మీ మొబైల్ ఫోన్ కనిపించలేదని కంగారుపడాల్సిన అవసరం లేదు, పోయిందని బాధ పడాల్సిన పని లేదు.. మీ ఫోన్‌ ఎక్కడ ఉన్నా క్షణాల్లో అదెక్కడ ఉందో ఇట్టే సంచార్‌ సాథీ పోర్టల్‌ ద్వారా కనిపెట్టేయొచ్చు. ఈ ‘సంచార్ సాథీ’ అనే వెబ్​ పోర్టల్‌ను సెంటర్ ఫర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ – CDOT రూపొందించింది. ముంబై, డిల్లీ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలలో సహా కొన్ని టెలికాం సర్కిల్‌లలో ఇప్పటికే CEIR సిస్టమ్‌ను CDOT అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైంది సర్కార్‌.. ఇప్పటివరకు ఈ పోర్టల్ సాయంతో 4.70 లక్షల మిస్సింగ్ మొబైల్‌ ఫోన్లను బ్లాక్ చేశారు. 2.40 లక్షల ఫోన్లను ట్రాక్ చేశారు. 8 వేల మొబైళ్లను రికవరీ చేశారు.

Exit mobile version