NTV Telugu Site icon

AP Bifurcation Act: ఏపీ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ లోని అంశాల అమలుపై కేంద్రం సమీక్ష

Ap Bifurcation Act

Ap Bifurcation Act

ఏపీ విభజన చట్టంలోని అంశాలు- అమలుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇవాళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, విద్యా సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, 13వ షెడ్యూల్ అనుసరించి ఆస్తుల విభజన తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏపీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం చేశారు. విభజన చట్టం స్పూర్తిని పరిగణనలోకి తీసుకుని తోడ్పాటు అందివ్వాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం తరపున అధికారులు కోరారు. మొత్తం 11 విద్య సంస్థల్లో ఇప్పటి వరకు “శాశ్వత క్యాంపస్”లు సమకూర్చుకుని ప్రారంభమైన 6 విద్యా సంస్థలు.. మరో 4 విద్యాసంస్థలకు “తాత్కాలిక క్యాంపస్”లు.. ఇంత వరకు మంజూరు కాని “వ్యవసాయ విశ్వవిద్యాలయం”.. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరపున అధికారులు తెలిపారు.

Read Also: Sudigali Sudheer: రష్మీతో పెళ్లి.. బాంబ్ పేల్చిన సుధీర్

మౌలిక వసతుల కల్పనలో 8 అంశాల అమలు పురోగతిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించింది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పురోగతిలో ఉన్న రెండు అంశాలు.. మౌలిక వసతుల కల్పనలోని 8 అంశాల అమలుకు సంబంధించి, చట్టంలో పేర్కొన్న మేరకు “పరిశీలించండి” అన్న పదాన్ని కాకుండా, విభజన చట్టం స్పూర్తిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ఉన్నతాధికారులు కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ తరఫున సీఎస్ జవహర్ రెడ్డి, శ్రీలక్ష్మి, ప్రేమచంద్రారెడ్డి, ఎస్ఎస్ రావత్ తదితర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ఎన్నికల కారణంగా తెలంగాణ అధికారులు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు.