NTV Telugu Site icon

Mansukh Mandaviya: ఇంతకీ నీవు కేంద్ర మంత్రివా.. టీమిండియా ప్లేయర్వా..

Mandaviya

Mandaviya

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ్య క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్‌లో ఆయ‌న స్థానికుల‌తో క‌లిసి కాసేపు గ్రౌండ్ లో క్రికెట్ ఆడారు. 51 ఏళ్ల మాండ‌వీయ.. పోరుబంద‌ర్ స్థానం నుంచి లోక్‌స‌భ‌ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ కు సైకిల్‌పై వ‌చ్చిన ఈయ‌న‌కు గ్రీన్ ఎంపీగా పేరు ఉంది. అయితే, బ్లాక్ టీ- ష‌ర్ట్ ధ‌రించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్ చేసి అక్కడ ఉన్న వాళ్లను ఉత్సహ పరిచారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేశాడు.. అలాగే, ఔట్ ఫీల్డ్‌లో కాసేపు ఫీల్డింగ్ కూడా చేసిన తర్వాత బ్యాటింగ్‌లోనూ భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నం చేశాడు.

Read Also: Daniel Balaji : చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగునింపిన నటుడు.. ఎంత గొప్ప మనసు నీది..

అయితే, కెమిక‌ల్స్ అండ్ ఫ‌ర్టిలైజ‌ర్స్ శాఖ‌కు కూడా మంత్రిగా మన్సూక్ మాండవీయ కొనసాగుతున్నారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత లోకల్ ప్లేయర్స్ తో కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. 2002లో ఎన్నికైన గుజ‌రాత్ యువ ఎమ్మెల్యేగా ఆయ‌న రికార్డు సృష్టించారు. 2012లో ఆయ‌న గుజ‌రాత్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2016 నుంచి ఆయ‌న ర‌వాణా శాఖ‌, షిప్పింగ్‌, ఫెర్టిలైజ‌ర్స్ శాఖ‌ల‌కు స‌హాయ‌ మంత్రిగా పని చేశారు. ఇక, 2018లో ఆయ‌న మ‌ళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మాన్సూక్ మాండ‌వీయ ప‌శు వైద్యం కూడా చేస్తారు.. 2021లో కోవిడ్ సంక్షోభం సమయంలో ఆయ‌న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.