గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్ జెట్టీ దగ్గర జామ్‌నగర్‌కు చెందిన కార్గో షిప్ మంటల్లో కాలిపోయింది. 950 టన్నుల బియ్యం, 100 టన్నుల చక్కెరను తీసుకెళ్తుండగా హరిదాసన్ అనే కార్గో షిప్ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ్య క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. గుజరాత్‌లోని పోరుబందర్‌లో ఆయన స్థానికులతో కలిసి కాసేపు గ్రౌండ్ లో క్రికెట్ ఆడారు.
గుజరాత్‌లో డిసెంబర్‌లో జరగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచర జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.