నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. మే 5న జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ జరిగిందని, అవకతవకలు జరిగాయని నీట్ యూజీ పునఃపరీక్ష నిర్వహించాలని కోరుతూ 40కి పైగా అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నీట్ రీ-ఎగ్జామ్ అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
READ MORE: TGSRTC : ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు
కాగా.. పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్షను నిర్వహించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో రెండు రోజుల్లో ఎన్టీఏ తుది ఫలితాలను ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. గరిష్టంగా రెండు రోజుల్లో కొత్త మెరిట్ జాబితా వస్తుందని తెలిపారు. నీట్‌పై విపక్షాలు అరాచకాలు సృష్టించాలని, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సత్యమేవ జయతే అని కేంద్ర విద్యాశాఖ మంత్రి అభివర్ణించారు. సత్యం గెలిచిందని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
READ MORE:Minister Narayana: వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమీక్ష..
మన విద్యార్థులే ప్రాథమికమని మొదటి నుంచి చెబుతున్నామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. “వారి ప్రయోజనాలను దెబ్బతీయకూడదు. సుప్రీం కోర్టు తీర్పు కూడా అదే విషయాన్ని తెలిపింది. అణగారిన వర్గాల విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించారు. మోడీ ప్రభుత్వం పారదర్శకంగా, సున్నా దోషం లేకుండా చేసేందుకు కట్టుబడి ఉందని కోర్టుకు ముందే చెప్పాం. ఎన్టీఏ పునరుద్ధరణకు కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ సక్రమంగా పనిచేస్తోంది. ఎన్టీఏని జీరో ట్యాంపర్ ఫ్రీగా మరియు జీరో ఎర్రర్ లేకుండా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Minister Narayana: వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమీక్ష..
ఈ మొత్తం ప్రక్రియలో జరిగిన గందరగోళంలో ఎవరినీ విడిచిపెట్టబోమని ఆయన స్పష్టంగా చెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నేరానికి పాల్పడిన నిందితులందరినీ కనిపెట్టేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.