Union Cabinet Meeting: నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోతుంది. అయితే గత ఎన్నికల కంటే తక్కువ స్థానాలు రావడంతో ఈ మంత్రివర్గ సమావేశానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి ఎన్డీయే మిత్రుల సహకారంతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా, ఇప్పుడు మిత్ర పక్షాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పాడింది.
Read Also: Lok Sabha Elections2024: దేశ వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ.. టాప్ 5 ఎంపీ అభ్యర్థులు వీరే
కాగా, ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పెద్దగా ఏ అంశాలపై చర్చించినప్పటికి తిరిగి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్నికల్లో సాధించిన విజయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని కీలక అంశాలపై మోడీ మంత్రి వర్గ సహచరులతో కీలకంగా చర్చిస్తారని సమాచారం. కేంద్ర మంత్రి వర్గ కూర్పుతో పాటు ఎన్డీయే కూటమిలోని మిత్రపక్ష పార్టీలకు అవకాశాలు కల్పించడంపై ఈ భేటీలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
