Union Cabinet Expansion: నేడు ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గ పునర్వవ్యస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా కసరత్తు చేసిన ప్రధాని మోడీ మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో కొత్త నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. గత వారం, పదిరోజులుగా బీజేపీ అగ్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు పూర్తయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , జాతీయ అధ్యక్షుడు నడ్డా , సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తోపాటు పలువురు అగ్రనేతలు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ పరిణామాల మధ్య కేంద్ర మంత్రివర్గం ఇవాళ ఢిల్లీలో భేటీ కాబోతోంది.
Also Read: Heavy Rains: విషాదాన్ని మిగులుస్తున్న వర్షాలు.. దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చ ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న నేపథ్యంలో ఆయన ఫ్లైట్ ఎక్కడానికి ముందే పునర్వ్యవస్థీకరణ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఆలోపే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉంది. శాఖల కేటాయింపుపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై కసరత్తు పూర్తయిందని, అందుకు అనుగుణంగానే పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర కేబినెట్‌లోకి తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దర్ని తీసుకోవాలని అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read: Flood fear in Delhi: యమున ఉగ్రరూపం.. ఢిల్లీకి వరద ముప్పు
కొంత మంది కేంద్ర మంత్రులను ఆ బాధ్యతల నుంచి తప్పించి వారిని పార్టీ అవసరాల కోసం పంపించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కిషన్‌రెడ్డిని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. భేటీ అయినవారిలోని కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని దేశ రాజధానిలో ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ నుంచి బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తారని సమాచారం. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 8 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ వర్షాకాల సమావేశాలపై చర్చించేందుకు బీజేపీతో పాటు వివిధ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి.