Site icon NTV Telugu

Central Cabinet: మరో మూడు రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ..?

Central Cabinet

Central Cabinet

ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గ విస్తరణ మరో రెండు మూడు రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కొత్త మంత్రులు పాల్గొనేలే బీజేపీ హైకమాండ్ నిర్ణయాలు తీసుకోవాలని భావించినట్లు తెలుస్తుంది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశాలకు ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీల మధ్య ఆయన ఫ్రాన్స్ కు వెళ్లనున్నారు. అయితే.. ప్రధాని మోడీ పర్యటనకు ముందే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని బీజేపీ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బుధవారం ఈ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందని ఇంకొన్ని వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Read Also: Viral News: వెరైటీ కండీషన్‌ తో బంధువులకు షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు.. ఎక్కడంటే?

ప్రధాని మోడీ మొదటి హయాంలో మూడు సార్లు కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించారు. రెండో సారి ప్రధాని అయ్యాక.. ఇప్పటికి రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగనున్న సందర్భంలో త్వరలో చివరి సారి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. లోక్ సభ ఎన్నికలకు తోడు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలనూ దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టాలని బీజేపీ అధిష్టానం చూస్తుంది. అందుకే ఈ సారి మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 20 మందికి చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి కొందరికి ఎన్నికల రాష్ట్రాల బాధ్యతలు అప్పగించాలని కమలం పార్టీ ఆలోచిస్తున్నట్టు టాక్.

Read Also: NBK 109 : భారీ యాక్షన్ సీన్స్ తో మొదలు కానున్న బాలయ్య తరువాత సినిమా..?

Exit mobile version