Sri Sathyasai: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. ముగ్గురు మహిళల మృతి
- ఘోర రోడ్డు ప్రమాదం
- ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
- ముగ్గురు మహిళల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిగి మండలం ధనాపురం సమీపంలో ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా పొడికొండ సిరా 544 జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Also Read:Pawan Kalyan: మార్క్ శంకర్ తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులు..
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులను రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మృతిచెందిన మహిళలను అలివేలమ్మ, ఆదిలక్ష్మీ, సకమ్మా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
- Tags
- auto
- Sri Sathyasai
- Women
తాజావార్తలు
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
-
Sports Injuries : జిమ్‌కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
-
Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
-
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?