ఈనెల 8న సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. మార్క్ చూసేందుకు ఈనెల 9న హుటాహుటిన వెళ్లారు పవన్‌కల్యాణ్. సింగపూర్ ఆస్పత్రిలో మార్క్‌కి నాలుగు రోజులపాటు చికిత్స జరిగింది. గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేశారట వైద్యులు. ఇక తాజా సమాచారం ప్రకారం మార్క్ శంకర్ కోలుకోవడంతో.. కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చారు పవన్. మార్క్ ను పవన్ కళ్యాణ్ ఎత్తుకొని.. ఎయిర్ పోర్టులో కనిపించారు. అటు తన భార్య కూడా పక్కనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Prabhas : ‘స్పిరిట్’ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే..?
సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లగా.. మార్క్ శంకర్ ను అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సులో చేర్చిందట లెజినోవా. ఓ వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో తీరిక లేకుండా ఉన్నారు పవన్. అయితే ఈ నెల 8న పవన్ అరకు పరిధిలో గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా, సింగపూర్ లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసింది. దీంతో తన సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారట. మొత్తనికి ఈ ప్రమాదం నుండి మార్క్ ప్రణాలతో బయటపడినందుకు అటు మెగా ఫ్యామిలితో పాటు.. ఇటు అభిమానులు కూడా ఊపిరి పిలుచుకుంటున్నారు.