Site icon NTV Telugu

Dry Ice: అయ్యయ్యో.. ఐస్ అనుకోని డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి..

Died

Died

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ప్రమాదవశాత్తు డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుశాంత్ సాహు మూడేళ్ల కుమారుడు తన కుటుంబంతో సహా రాజేందాంగ్ ప్రాంతంలో ఓ వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకలో నిర్వాహకులు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం డ్రై ఐస్‌ను ఓ చోట వాడారు. అయితే అది ఐస్ క్రీం అనుకోని ఓ మూడేళ్ళ బాలుడు డ్రై ఐస్ తిన్నాడు. అనంతరం బాలుడు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ద్రువదృష్టశాత్తు చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Also Read: Pawan Kalyan: వైసీపీని ఓడించి తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలి..

ఈ మధ్య గురుగ్రామ్‌ లోని ఒక కేఫ్‌లో జరిగిన సంఘటనలో మౌత్ ఫ్రెషనర్‌ గా డ్రై ఐస్‌ ను తిన్న ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సంఘటనలో బాధితులు తన నోటి మంటతో రక్తం వాంతులు చేసుకున్నారు. కాబట్టి ఇటువంటి పదార్థాలు ఉన్న చోట పిల్లలను కాస్త దూరంగా ఉంచితే మనకి మంచిది. లేకపోతే ఇలాంటి దారుణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Exit mobile version