Undavalli Arun Kumar: చిట్ ఫండ్ కంపెనీలను ప్రశ్నిస్తే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు నాపై కోపం ఎందుకు ? అని ప్రశ్నించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ వాళ్లు చర్చకు వెనుకకు ఎందుకు తగ్గారో అర్ధం కాలేదన్నారు.. ఇక, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదు.. టీడీపీ, వైసీపీ నేతలు తిట్టుకుంటే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. ఇక, మార్గదర్శి కేసును ఈ ఏడాదిలో ముగింపుకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఉండవల్లి.. రాష్ట్రంలో ఏ చిట్ ఫండ్ కంపెనీ నిబంధనలు పాటించడం లేదన్న ఆయన.. చిట్స్ నిబంధనలు పాటించని వారిని ఏం చేయాలో ఒక కమిటీ వేయాలి.. చిట్స్ కేసుల్లో అరెస్టులు అనవసరం అన్నారు.
Read Also: Pooja Hegde : బ్లాక్ అండ్ బ్లాక్ లో బంగారు రంగు మేనితో బుట్టబొమ్మ మామూలుగా లేదు
వైసీపీకి చెందిన వారు నిర్వహిస్తున్న చిట్స్ లో అక్రమాలు నా దృష్టికి రాలేదన్నారు ఉండవల్లి.. వస్తే చెప్పమన్నారు.. మార్గదర్శి చిట్ ఫండ్ పై చర్చకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి వెనుకకు తగ్గారు.. మళ్లీ తరువాత వస్తానన్నారు… వస్తే చర్చ ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు.. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ పై నేను కేసు వేయలేదు.. రాష్ట్ర ప్రభుత్వామే దాడులు చేస్తోందన్న ఆయన.. మార్గదర్శి ఫైనాన్షర్స్ పైనే నా పోరాటం.. నా కేసులో జూన్ 15వ తేదీన కోర్టులో విచార ఉందన్నారు.. మరోవైపు కర్ణాటక ఎన్నికల విజయం సాధించిన కాంగ్రెస్ శ్రేణులకు అభినందలు తెలిపారు ఉండవల్లి.. చరిత్ర పునావృత్తం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆయన.. బీజేపీ అధికారంలో ఉండటం మంచి పరిణామమే.. అయినా ఎవరూ ప్రశ్నించే స్థాయి లేకపోవడం ప్రమాదం అని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం దేశానికి మంచిది.. రాహుల్ గాంధీలో ఇప్పుడు రాజీవ్ గాంధీ కనిపిస్తున్నారు అని వ్యాఖ్యానించారు ఉండవల్లి అరుణ్‌కుమార్..