శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం అనుమానస్పద స్థితిలో బాలిక మరణించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. పోలీసుల విచారణ.. బాలికను మేనమామ కొడుకే (విష్ణు) అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు. మేనమామ కొడుకుతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మైనర్ బాలిక.. కొద్ది రోజుల నుంచి మేనమామ కొడుకుని దూరం పెట్టింది. అయితే.. మైనర్ బాలిక దూరం పెట్టడానికి జీర్ణించుకోలేక కుట్ర చేసి హత్య చేశాడు విష్ణు. దీంతో.. బాలిక మేనమామ కొడుకు విష్ణును అరెస్ట్ చేశారు శంషాబాద్ పోలీసులు.
Also Read : Karnataka: బీజేపీ మూడో జాబితా విడుదల.. శెట్టర్ ప్లేస్ ఆయనకే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేనమామ కొడుకు విష్ణు, బాలిక ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. 4 నెలలుగా విష్ణుని మైనర్ బాలిక దూరం పెట్టింది. మరొకరితో సన్నిహితంగా ఉంటున్న మైనర్ బాలిక చూసి.. తట్టుకోలేని విష్ణు ప్లాన్ ప్రకారం బాలికను హత్య చేశాడు. శంషాబాద్ మధురానగర్ లోని ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్ళి బలవంతంగా అత్యాచారం.. ఆపై బండ రాయితో మోది హత్యకు పాల్పడ్డాడు. 11న హత్య జరుగగా.. 14న కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసుగా పోలీసులు నమోదు చేసుకొని.. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. దీంతో.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో విష్ణుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Also Read : Off The Record : అందరికి అదే ఎందుకు..? ఇక్కడే ఎందుకంత స్పెషల్..?