Site icon NTV Telugu

Liquor Bottles: ఇది స్కూటినా.. లేక వైన్ షాపా.. అక్రమ మద్యం వీడియో వైరల్..

Liqour

Liqour

ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా చిత్రాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్పా చిత్రాన్ని తలపించే విధంగా చొక్కా కింద ప్రత్యేకంగా టైలర్ చేసిన జాకెట్ ధరించి రూ.20 లక్షల నగదు, 25 తలా బంగారంతో ఓ వ్యక్తి పట్టుబడగా.. తాజాగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తుండగా గోపయ్య అనే వృద్ధుడు పట్టుబడ్డాడు.

Also Read: Lakshmi Parvathi: బాలయ్యపై లక్ష్మీపార్వతి హాట్‌ కామెంట్స్‌.. అభిమానం వేరు.. అభివృద్ధి వేరు..!

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగాం చెక్‌పోస్టు వద్ద తెలంగాణ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ తో కూడిన ఓ స్కూటర్‌ ను పోలీసులు ఆపారు. గోపయ్య తీరు అనుమానాస్పదంగా ఉండడంతో స్కూటర్‌ ను తనిఖీ చేశారు. దీంతో లోపల తెలంగాణలో తయారైన మద్యం సీసాలు బయటపడ్డాయి. ఇలా బండిలోనుంచి ఒక్కొక్కటిగా బయటికి తీయగా మొత్తం 100 క్వార్టర్‌ బాటిళ్లు లభించాయి. ఈ మద్యాన్ని తెలంగాణలోని కోదాడ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నందిగామకు తరలిస్తున్నట్లు గోపయ్య తెలిపాడు.

Also Read: Komatireddy Venkat Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుంది..

మద్యం బాటిళ్లతో పాటు మోటార్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అక్రమ మద్యం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version