కాలం మారుతున్నా.. వరకట్నం కోసం వేధించేవారు మాత్రం అస్సలు మారడం లేదు. రోజుకో ఎక్కడో చోట వరకట్న వేధింపులకు ఆడబిడ్డల ప్రాణాలు బలైపోతున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత అవగాహన తీసుకొచ్చినా ధనదాహంతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.
Read Also: MP MV vs MLA Velagapudi: ఎమ్మెల్యే వెలగపూడికి ఎంపీ ఎంవీవీ ఛాలెంజ్..
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని గాజులరామారంకి చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.4 కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అర కేజీ బంగారం, 2 కేజీల వెండి వస్తువులు, రూ. 10 లక్షల నగదు, హయత్ నగర్‌లో రూ. 3 కోట్ల విలువ చేసే ఫ్లాటు కట్నం కింద ఇచ్చారు.
Read Also: Farmers Protest: ఢిల్లీలో విషాదం.. నిరసనలో పాల్గొన్న అన్నదాత మృతి
ఈ కట్నం సరిపోలేదని అత్తింటి వారు అమరావతిని వేధించారు. దీంతో అత్తింటి వేధింపులు తట్టుకోలేక అమరావతి సూసైడ్ లెటర్ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, అత్తమామలే కారణమని రాసి ఆత్మహత్య చేసుకుంది. అయితే వివాహిత రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది. తన పిల్లలను అనాథ ఆశ్రమంలో చేర్పించాలని కోరింది. ఈ ఘటనతో గాజులరామారంలో విషాదచాయలు అలుముకున్నాయి. అమరావతి సోదరుడి ఫిర్యాదు మేరకు అభిలాష్‌తో పాటు అతడి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.