NTV Telugu Site icon

Chittoor Crime: మైనర్‌పై అత్యాచారం.. అవమానం తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

Chittoor Crime

Chittoor Crime

Chittoor Crime: సమాజంలో రోజురోజుకూ మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేదు.. ఆడపిల్ల అయితే చాలనుకుని మృగాళ్లలా మీద పడిపోతున్నారు కొందరు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరికొందరు. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా జంకే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా కమతంపల్లిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగోలోకి వచ్చింది.

Read Also: Matchbox: అగ్గిపెట్టె కోసం గొడవ.. యువకుడి దారుణహత్య..

చిత్తూరు జిల్లా కమతంపల్లిలో దారుణం జరిగింది. పుంగనూరు మండలం కమతంపల్లిలో మైనర్‌ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు గణేష్ అనే ఓ కామాంధుడు. ఈ క్రమంలో అవమానం తట్టుకోలేక మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్య గురించి తెలుసుకున్న నిందితుడు ఊరి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు గణేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిపై బాలిక బంధువులతో పాటు గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.