Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ulajh Actor Gulshan Devaiah Said I Did Not Speak Wrongly About Janhvi Kapoor

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ గురించి తప్పుగా మాట్లాడలేదు.. ప్లీజ్ వదిలేయండి: హీరో

Published Date :July 23, 2024 , 9:12 am
By Sampath Kumar
  • ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు ఉలఝ్‌
  • జాన్వీ మంచి నటి
  • ఫ్రెండ్లీ రిలేషన్‌ లేదు
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ గురించి తప్పుగా మాట్లాడలేదు.. ప్లీజ్ వదిలేయండి: హీరో
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gulshan Devaiah About Janhvi Kapoor in Ulajh Shooting: బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీ కపూర్‌ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని నటుడు గుల్షన్‌ దేవయ్య స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదని మాత్రమే తాను అన్నానని తెలిపారు. జాన్వీ మంచి నటి అని ఆయన చెప్పారు. సుధాన్షు సరియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉలఝ్‌. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌, గుల్షన్‌ దేవయ్య నటించారు. ఆగస్టు 2న ఉలఝ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇద్దరూ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు.

తాజాగా గుల్షన్‌ దేవయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘జాన్వీ కపూర్‌తో నాకు ఫ్రెండ్లీ రిలేషన్‌ లేదు. సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే నాతో మాట్లాడేది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గుల్షన్‌పై ట్రోల్స్ రావడంతో ఆయన స్పందించారు. ‘జాన్వీ కపూర్‌ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదు అని అన్నాను. అది మా ఇద్దరి తప్పు కాదు. జాన్వీ మంచి నటి. చాలా ప్రొఫెషనల్‌గా నటిస్తారు. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి’ అని గుల్షన్‌ అన్నారు.

Also Read: Realme 13 Pro 5G Launch: రియల్‌మీ నుంచి రెండు సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు.. నయా ఫీచర్‌, బిగ్ బ్యాటరీ!

‘చేసే ప్రతి సినిమా సెట్‌లోనూ చిత్ర యూనిట్ అంతా ఓ కుటుంబంలా కలిసిపోవాలనే నిబంధన లేదు. నేను ఎవరినీ కించపరచడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. సినిమా కోసం నేను, జాన్వీ వందశాతం కష్టపడ్డాం. డైరెక్టర్ చెప్పినట్లు చేశాం. నేను చాలా మంది హీరోయిన్స్‌తో నటించా. వారితో నాకు మంచి స్నేహం ఉంది. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హాలతో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. మేము సెట్‌లో ఎన్నో విషయాలు చర్చించుకునే వాళ్లం. జాన్వీతో మాత్రం సినిమా గురించి మాత్రమే చర్చించా. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో తెలిపా. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి’ అన్ని గుల్షన్‌ దేవయ్య పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gulshan Devaiah
  • Gulshan Devaiah on Janhvi Kapoor
  • Janhvi Kapoor
  • Janhvi Kapoor Gulshan Devaiah
  • Janhvi Kapoor New Movie

తాజావార్తలు

  • US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!

  • Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions