Cannes Film Festival: ఉక్రెయిన్‌కు చెందిన ఒక మోడల్ (సావా పాంటీజ్‌స్కా) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై చట్టపరమైన కంప్లైంట్ చేసింది. రెడ్ కార్పెట్‌పై నడుస్తుండగా సెక్యూరిటీ గార్డు ఆమెతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. కేన్స్ ఫెస్టివల్‌కు హాజరైన చాలా మంది అతిథులలో ఫ్యాషన్ టీవీ మోడల్ సావా పొంటిజ్కా ఒకరు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మోడల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Read Also: AP Elections Results: తూర్పు సెంటిమెంట్ మల్లి రిపీట్.. అధికారం మారబోతుందా?
కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో మోడల్ సావా పాంటీజ్‌స్కా షేర్ చేసిన వీడియోలో.. సెక్యూరిటీ గార్డు ఆమెను బలవంతంగా అడ్డుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో పాంటీజ్‌స్కా దాదాపు నేలపై పడిపోయింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘శారీరక వేధింపులు, మానసిక హాని’ కలిగించారని ఆరోపించింది. తన ప్రతిష్టను కూడా దెబ్బతీశారని పేర్కొనింది. దీని కోసం 100,000 యూరోల నష్టపరిహారాన్ని సావా పాంటీజ్‌స్కా డిమాండ్ చేసింది.
Read Also: Turkish Drone Strike : సిరియాలో టర్కియే డ్రోన్ దాడి.. నలుగురు అమెరికా యోధులు మృతి
ఇక, పాంటిజ్‌స్కా ప్యాలెస్ డెస్ ఫెస్టివల్స్ మెట్లపై నిలబడి ఉంది.. అక్కడ ఒక మహిళా గార్డు ఆమెను లోపలికి తోస్తోంది. ఈ సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో పొంటిజ్‌స్కా దాదాపు నేలపై పడిపోతుంది. దీని తర్వాత మోడల్ మెట్లు దిగేందుకు ప్రయత్నించగా, మరికొందరు భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకుని లోపలికి తీసుకెళ్లారు. పాంటీజ్కా తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంది.