Zelensky: ఖేర్సన్ మాదే.. రష్యన్ దళాలు ఉపసంహరించుకున్న తర్వాత జెలెన్స్కీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zelensky: ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరం నుంచి రష్యా దళాలు ఉపసంహరించుకున్న తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ‘ ఖేర్సన్ మాదే’ అని ప్రకటించారు. దీనిని అమెరికా అసాధారణ విజయంగా ప్రశంసించింది. ప్రస్తుతానికి ఉక్రెయిన్ బలగాలు నగర శివార్లలో ఉన్నాయని, ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పటికే నగరంలో ఉన్నాయని జెలెన్స్కీ టెలిగ్రామ్‌లో రాశారు. ఉక్రేనియన్ దళాలు నివాసితులతో సమావేశమైనట్లు కనిపించిన ఫుటేజీని పోస్ట్ చేశారు. ప్రజల సందడి, నగరవ్యాప్తంగా ఉక్రెయిన్ జెండాలు వెలిసిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దక్షిణాన కిన్‌బర్న్ కేప్ మినహా మొత్తం ప్రాంతం ఉక్రేనియన్ నియంత్రణకు తిరిగి వచ్చిందని గవర్నర్ విటాలి కిమ్ చెప్పారు.
remarks against President:’మన రాష్ట్రపతి ఎలా కనిపిస్తారు’.. టీఎంసీ మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలగుతున్నట్లు రష్యా సైన్యం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రష్యా శుక్రవారం ప్రకటించింది. నిప్రో నదిపశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. సిబ్బందితోపాటు ఆయుధ సామగ్రిని నిప్రో నది తూర్పు తీరంవైపు తరలించినట్లు పేర్కొంది. ఖేర్సన్ నగరం క్రమంగా తమ నియంత్రణలోకి వస్తున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని తెలిపింది. స్థానికంగా ఎవరైనా రష్యా సైనికులు ఉంటే.. వెంటనే లొంగిపోవాలని సూచించింది. తమ సేనలు దాదాపు 41 ప్రాంతాలను విముక్తి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ప్రకటించారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగారు. మరోవైపు.. ఖేర్సన్ సమీప మైకోలైవ్‌లోని నివాసిత ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!