NTV Telugu Site icon

Ukraine Russia War: ఉక్రెయిన్ కీలక ప్రకటన.. రష్యన్ బాంబర్‌ను ఏం చేసిందంటే..!

Flite

Flite

గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే బాంబులతో దద్దరిల్లుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ ఒక కీలక ప్రకటన చేసింది. శత్రుదేశానికి చెందిన ఓ దీర్ఘశ్రేణి వ్యూహాత్మక బాంబర్‌ను కూల్చివేసినట్లు వెల్లడించింది. అయితే పుతిన్‌ ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండించింది. సాంకేతికలోపం కారణంగానే అది స్టావ్రోపోల్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయిందని తెలిపింది.

ఇది కూడా చదవండి: Lingusamy: దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు .. లింగుసామి కంపెనీ కీలక వ్యాఖ్యలు

నిఘా వ్యవస్థ సహకారంతో యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు.. మాస్కోకు చెందిన టీయూ-22ఎం3 దీర్ఘశ్రేణి వ్యూహాత్మక బాంబర్‌ను కూల్చేశాయని ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మరోవైపు కూలిపోయిన ఆ బాంబర్‌లోని నలుగురు సిబ్బందిలో ముగ్గురిని కాపాడినట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది. మరొకరి కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు చెప్పింది. అయితే.. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు మృతి చెందినట్లు స్టావ్రోపోల్‌ గవర్నర్‌ చెప్పారు.

ఇది కూడా చదవండి: Jaggareddy: బీజేపీ నేతలు డూప్లికేట్‌ దేశభక్తులు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే రష్యన్ క్షిపణులు ఉక్రెయిన్‌లోని సెంట్రల్ డ్నిప్రో ప్రాంతంలోని నగరాలపై దాడి చేశాయి. దీని ఫలితంగా 8 ఏళ్ల బాలికతో సహా ఎనిమిది మంది మరణించారు. 25 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకారం.. రష్యా దళాలు రాత్రి సమయంలో వివిధ రకాల 22 క్షిపణులు, 14 షాహెద్ డ్రోన్‌లను ఉపయోగించి సంయుక్తంగా వైమానిక దాడి చేశాయి. మొత్తం పద్నాలుగు షాహెద్ డ్రోన్‌లు మరియు 15 క్షిపణులను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది.

ఇది కూడా చదవండి: KL Rahul: నాకు ఆర్సీబీ తరపున ఆడాలని ఉంది..