IPL 2024: ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవీచంద్రన్ ఆశ్వీన్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లో క్రికెట్‌కు సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా RCB టీమ్ గురించి, అలాగే, హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడటం గురించి ఆసక్తిర విషయాలను తెలిపారు. కర్ణాటకకు చెందిన ఆటగాడిని కావడంతో ఆర్‌సీబీ తరఫున ఆడాలనే కోరిక ఉంది అని తన అభిప్రాయాన్ని కేఎల్ రాహుల్ వ్యక్తం చేశాడు.
Read Also: Mansoor Ali Khan: హాస్పిటల్ నుంచి వచ్చి పోలింగ్ బూత్‌లో మన్సూర్ అలీఖాన్ హల్చల్!
అయితే, ఐపీఎల్ లోకి 2022లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్ నిర్వహిస్తున్నారు. టీమ్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదే ప్లేఆఫ్స్ కు జట్టును చేర్చి.. తనలోని కెప్టెన్సీగా సత్తా చాటాడు. అయితే, దీనికి ముందు అతను పంజాబ్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించారు. అయితే, 2022లో ఎల్‌ఎస్‌జీలో కెప్టెన్‌గా చేరాడు. రెండు సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ.. అతను బహుశా ఈ ఫ్రాంచైజీతో సంతోషంగా లేడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలి కేఎల్ రాహుల్ అశ్వీన్ యూట్యాబ్ ఛానల్ లో ప్రకటనతో అర్థం అవుతుంది.
Read Also: Dubai Floods: ఇంకా నీళ్లల్లోనే దుబాయ్.. స్తంభించిన జనజీవనం
ఇక, కేఎల్ రాహుల్ 2013లో ఆర్సీబీ తరపున అరంగేట్రం చేసాడు.. ఆ తర్వాత అతను 2014, 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగాడు. దీని తర్వాత, 2016 సంవత్సరంలో అతను మళ్లీ ట్రేడ్ ద్వారా ఆర్సీబీకి వచ్చాడు. అయితే 2017వ సీజన్ లో గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో 2018లో ఆర్సీబీ అతడ్ని వేలంలోకి వదిలేసింది. ఇక, పంజాబ్ కింగ్స్ కేఎల్ ను తమ జట్టులో చేర్చుకుంది. 2018 నుంచి 2021 వరకు పంజాబ్‌కు కెప్టెన్ గా ఉన్నారు.. ఆ తర్వాత 2022 సంవత్సరంలో కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ రాహుల్‌ను తమ జట్టుకు కెప్టెన్‌గా చేసింది. అప్పటి నుంచి కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నారు. అతను ఇప్పటి వరకు 124 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4, 367 పరుగులు చేయగా.. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి.
KL Rahul opens up about the RCB Fandom, being a Karnataka player & how he'd have loved to have played for RCB. Episode 3 of #KuttiStorieswithAsh is out on our YT Channel. Watch the full episode in the link below:https://t.co/2tkR4X67Un pic.twitter.com/oeoT8v7D4J
— Crikipidea (@crikipidea) April 18, 2024