Ugadi 2024 : ‘ఉగాది’ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ugadi 2023 : ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం+ఆది ‘యుగాది’ లేదా ‘ఉగాది’ అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాలక్రమేణా అదే పండుగగా మారింది. ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. సోమవారంతో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ముగుస్తుంది. మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. వసంతమాసంలో వస్తుందీ పండుగ. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది.
భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతీ తెలుగు సంవత్సరాదికి ఓ పేరు ఉంటుంది. అలా ఈ 2024వ సంవత్సరం ఉగాది పేరు ‘క్రోధి నామసంవత్సరం’.. ఉగాది రోజునే సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడం ప్రారంభించారని చెబుతారు. ప్రభవ నామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Read Also: Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశిఫలాలు
ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ‘ఉగాది’పేరుతో జరుపుకుంటారు. మరి భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఏఏ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారో తెలుసా?.. ఎందుకంటే భారతదేశం విభిన్నజాతులు,మతాలు,కులాలు,సంస్కృతి,సంప్రదాయాల మేలు కలయిక.అలాగే ఎన్నో భాషలు భారత్‌లో వాడుకలో ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ ఇలా ఎన్నో భాషల కలయికగా విరాజిల్లుతోంది మన భారతదేశం. అందుకే దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలు కూడా ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి పేర్లు మార్పుతో భారతీయులు జరుపుకుంటుంటారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోనే జరుపుకుంటారు. అదే మహారాష్ట్రలో గుడి పడ్వాగా, కేరళలో విషు, తమిళనాడులో పుత్తాండు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే అర్థం ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం ‘ఆది’ అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి, ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. జనవరి ఒకటవ తేదీన పాశ్చాత్తులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు. తెలుగు వారికీ కొత్త సంవత్సరం..వసంత ఋతువు, చైత్ర మాసంలోని పాడ్యమి రోజునుంచి ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!