NTV Telugu Site icon

Kakarla Suresh: ఉమ్మడి మేనిఫెస్టో అద్భుతం.. ప్రచారంలో ప్రజాదరణ పొందుతున్న కాకర్ల సురేష్

Kakarla Suresh

Kakarla Suresh

Kakarla Suresh: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదయగిరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలు ఆయనను పూల వర్షాలతో ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జలదంకి మండలం కొత్తపాలెం, సోమవరప్పాడు, కృష్ణపాడు, బోయలపాడు, వేములపాడు, కోదండరామపురం పంచాయతీలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ కరపత్రాలు అందజేస్తూ ఓట్లను అభ్యర్ధించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాగళం, ఉమ్మడి మేనిఫెస్టో అద్భుతమని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఇళ్లలో సంతోషాలు వెళ్లి విరుస్తాయని ఎన్డీఏ కూటమి ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మీ గ్రామాల్లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి టీడీపీ హయాంలో మాత్రమే జరిగిందన్నారు. ఇల్లు, రోడ్లు, కాలువలు, తదితర అన్ని అభివృద్ధి పనులు చేసింది టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. మోడీ సహకారంతో రాష్ట్ర ప్రజల తలరాతలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్చనున్నారని, బంగారు భవిష్యత్‌ను ఇవ్వనున్నారని తెలిపారు. పొదుపు గ్రూపులను ప్రవేశపెట్టిన చంద్రబాబు మహిళల ఆర్ధిక స్వావలంబనకు కృషి చేశారని అన్నారు. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి అందిచడం జరుగుతుందన్నారు. స్కూల్‌కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 అందిస్తారని, ప్రతి రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం ఇస్తారని, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు రూ. 1,500 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులు, వితంతువులకు నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే రూ.4 వేల పింఛను ఇస్తామన్నారు. పెంచిన పింఛన్లను ఏప్రిల్‌ నుంచి పరిశీలించి జూన్‌లో పెంచిన పింఛన్లను అందజేస్తామన్నారు.

టీడీపీలోకి చేరికలు
వరికుంటపాడు మండలం మహందాపురం పంచాయతీ గొల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వింజమూరు కాకర్ల క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కాకి ప్రసాద్‌, జిల్లా అధ్యక్షులు ఓబులాపురం దేవా ప్రసన్నకుమార్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లోకసాని రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. వింజమూరు పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ వాసులు టీడీపీలో చేరారు. వారందరికీ తెలుగుదేశం కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కాకర్ల సతీమణి ప్రచారం
పుణ్యభూమి సేవే పరమాధిగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగాయని కాకర్ల సతీమణి కాకర్ల ప్రవీణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక పంచాయతీ ఎస్సీ కాలనీలలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వేల్పుల వేణుగోపాల్ సారథ్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కాకర్ల ప్రవీణ మాట్లాడుతూ.. పేదల కష్టాలను దగ్గరగా చూసిన కాకర్ల సురేష్ ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఆమె వెల్లడించారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి తెలుగుదేశాన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ, తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఉదయగిరి సేవకై వచ్చారని ఆశీర్వదించాలని ప్రార్థించారు. అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరించారు. అక్క చెల్లెమ్మల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అన్నదమ్ముల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

టీడీపీ తీర్థం పుచ్చుకున్న యర్రా వెంకటేశ్వర్లు
వింజమూరు మండలం బుక్కాపురం పంచాయతీ చంద్ర పడియ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు యర్రా వెంకటేశ్వర్లు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్ర పడియాలోని ఆయన నివాసంలో టీడీపీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి సమక్షంలో బుధవారం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు తెలుగుదేశం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం విజయానికి కృషి చేస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు, కే శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి నాయుడు, కె పి లక్ష్మణ్, బి వెంకయ్య, పసుపులేటి రమణయ్య, చలపతి సాంబయ్య, మన్యం సుబ్బారావు, తదితరులు ఉన్నారు.