India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 46.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అర్జున్ రాజ్‌పుత్ అద్భుతమైన సెంచరీ (107 పరుగులు) సాధించి జట్టును ఆదుకున్నాడు. చివర్లో కావ్యా పటేల్ (23 పరుగులు) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కూడా ప్రారంభంలో తడబడినప్పటికీ, హంజా జహూర్ అజేయ శతకంతో మెరిసి పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు.
మ్యాచ్ అనంతరం భారత అండర్-19 జట్టు కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని మీడియాతో మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలపై స్పందించారు. తాము చేసిన స్కోరు విజయానికి సరిపోదని, మరో 20 నుంచి 30 పరుగులు తక్కువగా చేశామని ఆయన నిజాయితీగా అంగీకరించారు. ఒక దశలో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ, అర్జున్ రాజ్‌పుత్ ఒంటరి పోరాటం చేశాడని కొనియాడారు. అర్జున్‌కు మరో బ్యాటర్ జతకలిసి ఉంటే స్కోరు మరింత మెరుగ్గా ఉండేదని తెలిపారు. ఈ మ్యాచ్‌లో కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయని, వాటిని తదుపరి మ్యాచ్‌లలో మెరుగుపరుచుకుంటామని చెప్పారు.
Also Read
బౌలింగ్ గురించి మాట్లాడుతూ, పాకిస్తాన్ జట్టును 61 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి అసాధారణ ఆరంభం దక్కించుకున్నామని, అయితే ఆ తర్వాత భాగస్వామ్యాన్ని విడదీయడంలో కొంచెం వెనుకబడ్డామని పేర్కొన్నారు. బౌలర్లు చివరి వరకు గట్టిగా ప్రయత్నించారని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రాబోయే మ్యాచ్‌లలో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, ఈ విజయంతో టోర్నమెంట్లో వరుసగా రెండో విజయం సాధించడం పట్ల పాకిస్తాన్ అండర్-19 జట్టు కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ హర్షం వ్యక్తం చేశారు. తమ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి అద్భుతంగా ఆడామని, ముఖ్యంగా హంజా జహూర్, హస్నైన్ డార్ జోడి జట్టును గెలిపించిన తీరు ప్రశంసనీయమని తెలిపారు. పిచ్ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని ఆడినందునే ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
-
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!