Site icon NTV Telugu

U-19 World Cup: U-19 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్‌ ప్రకటించిన ఐసీసీ

U 19

U 19

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈరోజు (సోమవారం) U19 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇంతకుముందు.. ఈ టోర్నమెంట్ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్ లో.. భారత్, బంగ్లాదేశ్, అమెరికా, వెస్టిండీస్, నమీబియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, నేపాల్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో కలిపి 16 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Read Also: Kishan Reddy: కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ.. భారత్ జోడో యాత్రకు ధీరజ్ సాహు ఆర్థిక సాయం..!

బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని మాంగాంగ్ ఓవల్‌లో జరిగే ఛాంపియన్‌షిప్ ప్రారంభ మ్యాచ్‌లో ఐర్లాండ్-యుఎస్ఎ జట్టు తలపడనున్నాయి. పోచెఫ్‌స్ట్రూమ్‌లోని జెబి మార్క్స్ ఓవల్, ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్, కింబర్లీలోని కింబర్లీ ఓవల్, బెనోనిలోని విల్లోమూర్ పార్క్ ఈ టోర్నమెంట్ కు వేదికలు కానున్నాయి. ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ తన తొలి మ్యాచ్ జనవరి 20న బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఆ తర్వాత.. జనవరి 25, 28 తేదీల్లో జరిగే తొలి రౌండ్‌లో ఐర్లాండ్‌తోనూ, అమెరికాతోనూ భారత్ తలపడనుంది.

Read Also: CM Revanth Reddy: ఉద్యోగ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..

Exit mobile version