నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రొట్టెల పండుగకు అని వచ్చిన ఇద్దరు మహిళలు స్వస్థలానికి చేరుకోకుండానే.. అనంత లోకాలకు వెళ్లారు. నెల్లూరు జిల్లాలో రొట్టెల పండగ చాలా ఫేమస్. అందుకోసమని ఆ పండుగను తిలకించేందుకు వెళ్లారు. కానీ మళ్లీ ఇంటికి చేరుకోలేదు.
Alert : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రానున్న గంటల్లో భారీ వర్షం
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులో రొట్టెల పండుగకు వచ్చిన గుంటూరుకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పండుగను తిలకించిన వారు తిరిగి తమ స్వస్థలానికి వెళ్లేందుకు.. రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద రైల్వే వంతెనపై ప్రమాదం జరిగింది. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక్కసారిగా వచ్చిన మధురై-నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లా పొన్నూరుకి చెందిన ఫాతి మున్నిసా, గౌసియాగా గుర్తించారు.
Tamannaah Bhatia: బాపుకే దొరకని బొమ్మవే.. బ్రహ్మకే వన్నె తెచ్చిన వెన్నెలమ్మవే
ఈ ఘటన తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను అక్కడి నుంచి మార్చురీకి తరలించారు.
