NTV Telugu Site icon

Train Accident: నేడు రెండు రైలు ప్రమాదాలు.. పశ్చిమ బెంగాల్‌, దక్షిణ గోవాలో పట్టాలు తప్పిన రైళ్లు..

Train Acciden

Train Acciden

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా కుమేద్‌పూర్ వద్ద గూడ్స్ రైలు ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ విషయాన్ని రైల్వే అధికార ప్రతినిధి ధృవీకరించారు. బీహార్-బెంగాల్ సరిహద్దు సమీపంలో జరిగిన ప్రమాదం కారణంగా ట్రాక్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైల్వే కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు లైన్లను క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లైన్లను క్లియర్ చేసే పనులను కతిహార్ డివిజనల్ రైల్వే మేనేజర్ పర్యవేక్షిస్తున్నారు.

READ MORE: Vivo V40 Pro Price: 50ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 బ్యాటరీ.. వివో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్స్!

దక్షిణ గోవాలో గూడ్స్ రైలు..
కర్ణాటక సరిహద్దులో ఉన్న దక్షిణ గోవాలోని కొండ ప్రాంతంలో శుక్రవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో నైరుతి రైల్వే (SWR) మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. హుబ్లీ డివిజన్‌ ​​పరిధిలోని సోనాలియం, దూద్‌సాగర్‌ స్టేషన్ల మధ్య ఘాట్‌ సెక్షన్‌లో ఉదయం 9.35 గంటలకు 17 లోడు బోగీలతో రైలు పట్టాలు తప్పిందని చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ మంజునాథ్‌ కన్మాడి తెలిపారు. దీంతో మూడు రైళ్లను దారి మళ్లించగా, మరో రెండు రైళ్లను రద్దు చేశారు.

READ MORE:Mrunal Thakur: కూతురు పేరు బయట పెట్టిన మృణాల్.. పెళ్లి కాకుండానే..?

సంఘటనా స్థలానికి 140 టన్నుల క్రేన్‌తో పాటు ఇతర అవసరమైన మెటీరియల్‌తో ప్రమాద సహాయ రైళ్లను పంపించామని, మరమ్మతు పనులు కొనసాగుతున్నాయన్నారు. రైలు నం. 17420/17022 వాస్కోడగామా – తిరుపతి/హైదరాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ మార్గోవ్, కార్వార్, పాడిల్, సుబ్రమణ్య రోడ్, హాసన్, అర్సికెరె, చిక్కజాజూర్, రాయదుర్గం, బళ్లారి వైపు మళ్లించారు. రైలు 12779 వాస్కోడగామా – హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ మార్గోవ్, రోహా, పన్వెల్, కళ్యాణ్, పూణే మీదుగా నడిపారు. హజ్రత్ నిజాముద్దీన్-వాస్కోడా గామా ఎక్స్‌ప్రెస్ (12780) కూడా దారి మళ్లించారు. 17309 యశ్వంత్‌పూర్-వాస్కోడగామా మరియు 17310 వాస్కోడగామా-యశ్వంత్‌పూర్ రెండు రైళ్లు రద్దు చేయబడ్డాయి.

Show comments