జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. కథువా ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా, 5 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ప్రత్యేక పోలీసు అధికారి భరత్ చలోత్రా కాల్పుల్లో గాయపడ్డారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో భారీ కాల్పులు, పేలుళ్లు సంభవించాయని అధికారులు తెలిపారు.
Also Read:Viral Video: డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్.. యూట్యూబర్కు ఇచ్చిపడేసిన ఆటోవాలా!
కథువా జిల్లాలోని సుఫాన్ అనే ప్రశాంత గ్రామం కాల్పులు, గ్రెనేడ్లు, కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. రాజ్‌బాగ్‌లోని ఘాటి జుతానా ప్రాంతంలోని జఖోలే గ్రామ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సైనికులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. వెంటనే ఆ ప్రాంతంలో అదనపు పోలీసు, సైన్యం, సిఆర్‌పిఎఫ్ బలగాలను మోహరించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) నాయకత్వంలో ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఈ ఆపరేషన్ నిర్వహించాయని అధికారులు తెలిపారు.