కోలీవుడ్‌లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక.. హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు.. కార్తీక్ సుబ్బరాజు, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిలో లోకీ మీదున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మల్టీస్టార్లర్లతో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకీ నుండి మరో అప్డేట్ లేదు. ఖైదీ2 అని కాసేపు .. కాదు కాదు.. రజనీ- కమల్ సినిమాను డీల్ చేస్తున్నాడని మరి కాసేపు. ఈ లోగా హీరోగా సినిమా స్టార్ట్ చేసాడు. డైరెక్టర్ గా నెక్ట్స్ సినిమా ఏంటో ఇప్పటికి నో అప్డేట్.
Also Read : Anupama Parameswaran : రెండు నెలల్లో అమ్మడి ఖాతాలో త్రీ హిట్స్
ఈ ఏడాది కార్తీక్ సుబ్బరాజు అటు దర్శకుడిగానే కాదు రచయితగా కూడా ఫెయిలయ్యాడు. సూర్యతో చేసిన రెట్రో యావరేజ్‌గా నిలిస్తే కథ అందించిన గేమ్ ఛేంజర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాల రిజల్ట్ తర్వాత కార్తీక్ పత్తా లేకుండా పోయాడు. ఏం చేస్తున్నాడో కూడా అప్డేట్ లేదు. కానీ రీసెంట్ కోలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ స్మాల్ సినిమాను తీయాలనుకుంటున్నాడట. దాని కోసం కథ ప్రిపేర్ చేస్తున్నాడట షూట్ పూర్తి చేసి ముందుగా థియేటర్లలో కన్నా ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపించబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఈ ఇద్దరి డైరెక్షన్ లో సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో థౌజండ్ క్రోర్ కొల్లగొట్టే ఫిల్మ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
