జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాల తనిఖీలు చేస్తుండగా.. అహ్లాన్ గగర్మండు ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇంకా.. అహ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. సెర్చ్ టీమ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. దీనికి ధీటుగా సైనికులు కూడా కాల్పులు జరుపుతున్నారు.
Read Also: Delhi: ఢిల్లీలో కూలిన బిల్డింగ్.. ఒకరి మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఇదిలా ఉంటే.. ఆగస్టు 6వ తేదీన బసంత్‌గఢ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. రెండు గంటల పాటు కాల్పులు మోత మోగింది. భద్రతా దళాలు సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. అడవిలో దాక్కున్న ఉగ్రవాదులపై సైన్యం గాలింపును పెంచింది. ఈ కాల్పుల్లో ఉగ్రవాదులెవరూ హతమైనట్లు సమాచారం లేదు. అంతకు ముందు ఒక రోజు.. భద్రతా దళాలు అనంత్‌నాగ్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేశాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను దావూద్ అహ్మద్ దార్, ఇంతియాజ్ అహ్మద్ రేషి, షాహిద్ అహ్మద్ దార్‌లుగా గుర్తించారు. ఈ ముగ్గురూ హసన్‌పోరా తవేలా నివాసితులు అని పోలీసులు కనుగొన్నారు.
Read Also: TV somanathan: కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్ నియామకం